Wednesday, 29 July 2026 08:21:45 AM

అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదు....

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

Date : 06 May 2025 10:43 AM Views : 562

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైరయ్యారు. ఓ పక్క వడ్లు అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సిఎం రేవంత్ మాత్రం అందాల పోటీలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని.. ఇవి సహజ మరణాలు కాదని.. ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని దుయ్యబట్టారు.పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని హరీష్ రావు ఆరోపించారు. కేవలం 20 శాతం పత్తి రైతులకు మాత్రమే మద్దతు ధర లభించిందని, 80 శాతం పత్తిని బ్రోకర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని అన్నారు. సీసీఐ అధికారుల పట్ల వెంటనే సిబిఐ దర్యాప్తు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

MAHENDAR

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :